నో మాస్క్…నో లిక్కర్… భౌతిక దూరం తప్పనిసరి…. చీప్ లిక్కర్‌పై 11%,…. మిగతా వాటిపై 16% ధరలు పెంపు
Kalinga Times, Hyderabad : రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 29 వరకు పొడగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బుధవారం నుంచి లాక్‌డౌన్‌లో పలు సడలింపులను ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మద్యం విక్రయాలకు అనుమతులనుఇస్తున్నట్లు చెప్పారు. మద్యంపై స్వల్పంగా ధరలను పెంచినట్లు పేర్కొన్నారు. పదవ తరగతి పరీక్షలను నిబంధనలు పాటిస్తూ ఈ నెలలో నిర్వహిస్తామన్నారు. అలాగే ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభిస్తున్నామని, ఫలితాలను సాధ్యమైనంత త్వరగా వెల్లడిస్తామన్నారు. రెడ్‌జోన్ల పరిధిలో లాక్‌డౌన్ నిబంధనలు కొనసాగుతాయన్నారు. ఆరెంజ్, గ్రీన్ జోన్ల్ పరిధిలో మాత్రం షాపులను తెరుచుకునేందుకు అనుతులిస్తున్నట్లు సిఎం తెలిపారు. ఇతర వ్యాధులు ఉన్న వారు బయటకు రావొద్దని జాగ్రత్తలు తీసుకోవాలని కెసిఆర్ కోరారు. వారికి కోటి మాస్కులు ఫ్రీగా అందిస్తామన్నారు. 65 సంవత్సరాలు దాటిన వారితో పాటు చిన్నపిల్లలు బయటకు రాకుండా వారి కుటుంబసభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్
భౌతిక దూరంతోనే విజయం ఇంకొన్నాళ్లు ఓపిక పడితే కరోనాను జయించొచ్చు దేశానికే కరీంనగర్ రోల్‌మోడల్
రాత్రి 7గం. తర్వాత బయటికొస్తే పోలీసు చర్యలు తప్పవు . రాష్ట్రంలో 35 మాత్రమే కంటైన్మెంట్ జోన్లు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్
జిల్లాల్లో కఠినం ముంబై దుస్థితి మనకు రావొద్దు.
నేను బతికున్నంత వరకు రైతుబంధు బంద్ కానేకాదు…
రూ.25వేల లోపు రైతు రుణాలు నేడే మాఫీ, రూ.1200 కోట్లు విడుదల …
తెలంగాణలో ఉండేది రైతు రాజ్యమే, చిల్లర రాజకీయాల రాజ్యం కాదు
ఈ నెలలోనే పదోతరగతి పరీక్షలు నేటి నుంచే ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్
ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మండల కేంద్రం నుంచి గ్రామాల దాకా అన్ని దుకాణాలు ఓపెన్,
పురపాలికల్లో లాటరీ పద్ధ్దతిలో 50 శాతం వరకే అనుమతి ..
తీవ్ర జబ్జులున్నవారికి 3 నెలల పాటు మందులు,
నేటి నుంచి ఆర్‌టిఎ, మైనింగ్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు పనిచేస్తాయి