National
గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో ఈకామర్స్ సంస్థల వ్యాపారం షురూ
Kalinga Times, New Delhi : దేశంలో కరోనా లాక్‌డౌన్‌ను కేంద్రం మే 17 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, కేంద్రం మే 4 నుంచి అమల్లోకి వచ్చేలా గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులు ప్రకటించింది. సవరించిన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో ఈకామర్స్ సంస్థలు అన్ని రకాల వస్తువులు విక్రయించుకోవచ్చని తెలిపింది. కాగా లాక్‌డౌన్ మొదలయ్యాక అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈకామర్స్ పోర్టళ్ల ద్వారా కేవలం నిత్యావసరాలనే అనుమతించారు.తమకు అన్ని రకాల వస్తువులు విక్రయించే వెసులుబాటు కల్పించాలని పలు ఈకామర్స్ సైట్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి.ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం వెలువడిందని భావిస్తున్నారు. ఈక్రమంలోనే కేంద్రం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బార్బర్ షాపులకు కూడా అనుమతి ఇచ్చింది.