Telangana
స్వంత రాష్ట్రాలకు పంపించాలంటూ ఎన్‌టిపిసిలో ఆందోళన
Kalinga Times, Godavarikhani : పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్‌టిపిసిలో పనిచేసే పశ్చిమబెంగాల్, ఘార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఆదివారం ఉదయం తమను వారి స్వంత రాష్ట్రాలకు పంపించాలంటూ ఆందోళన చేశారు. తమను తమ స్వంత రాష్ట్రాలకు పంపాలని శనివారం పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వారి విజ్ఞప్తిపై స్పందన లేకపోకవడంతో నేడు మరోసారి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని పంపించేందుకు సమయం పడుతుందని తెలపడంతో, అసహనానికి గురయి రాజీవ్ రహదారిపైకి చేరుకుని ధర్నాకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అక్కడికి చేరుకుని మరో రెండు రోజులలో వారి సొంత రాష్ట్రాలకు పంపే ఏర్పాట్లు చేస్తామని హమీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.