Telangana
స్వచ్ఛ దినోత్సవం ఏ డబ్ల్యు జే మేడ్చల్ నూతన అధ్యక్షుడిగా కొండపర్తి సదాచారి
Kalinga Times ,Medchal : మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మేడ్చల్ జిల్లాకు నూతన అధ్యక్షుడిగా నియమితులైన సీనియర్ జర్నలిస్ట్ కొండపర్తి సదా చారి నీ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా, పలువురు జర్నలిస్టులు స్థానిక నాయకుల సమక్షంలో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ కరోనా వైరస్ నిర్మూలన కోసం కీలక పాత్ర పోషిస్తున్న మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సదా చారి తనదైన శైలిలో అంచలంచలుగా ఎదుగుతూ విలేకర్ వృత్తి ధర్మాన్ని కాపాడుతూ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ జర్నలిస్ట్ కొండపర్తి సదాచారి కి అభినందనలు తెలియజేశారు. అనంతరం కొండపర్తి సదా చారి మాట్లాడుతూ మే 3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ప్రజల కోసం, పత్రిక స్వేచ్ఛ కోసం కృషి చేస్తున్న మన పాత్రికేయ మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ, అసువులు బాసిన సంపాదకులకు, విలేఖర్లకు ఈ రోజున నివాళులర్పించడం మన కనీస ధర్మం అని గుర్తు చేశారు. మేడ్చల్ జిల్లాలో జర్నలిస్టుల సమస్యలపై అలుపెరుగని ఉద్యమకారుడిగా అహర్నిశలు ముందుకు సాగుతానని నాపై నమ్మకంతో ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు ఏ ఎం రాజు రెడ్డి. మరియు జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే కోటేశ్వరరావు గార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
జవహర్ నగర్ లో ఉన్న విలేకరి మిత్రులు అభిమానంతో ఏర్పాటుచేసిన చిరు సన్మాన సభ కార్యక్రమంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా పాల్గొని ఘనంగా సన్మానించిన సందర్భంగా వారికి మరియు విలేఖరి మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విలేకరి మిత్రులు అరుణ్ కుమార్ త్యాగి, భవాని శంకర్, శంకరాచారి, గంగాధరచారి వినోద్, సత్యనారాయణ, సోమ చారి, రామడుగు రాజు, రమేష్ చారి, దినకర్, రమేష్, వెంకటాచారి, విజయ్ కుమార్ ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు పోరండ్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.