Film
సెన్సాఫ్ హ్యూమర్‌తో పాటు దయాగుణం ఉండే అమ్మాయిలంటేనే ఇష్టం-విజయ్ దేవరకొండ
Kalinga Times,Hyderabad : టాలీవుడ్ రౌడీ స్టార్. లాక్‌డౌన్ కారణంగా స్వీయ గృహ నిర్బంధంలో ఉంటున్న విజయ్ దేవరకొండ జాతీయ మీడియాతో ముచ్చటిస్తూ పెళ్లిపై ఆసక్తికర విషయాలు చెప్పారు. తన పెళ్లికి ఇప్పుడే తొందరేం లేదని చెప్పిన విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం చాలా విషయాలపై దృష్టిపెట్టి ఖాళీ లేకుండా పని చేస్తున్నానని అన్నారు. ప్రస్తుతం తన టార్గెట్ అంతా కెరీర్ పైనే ఉందని చెప్పారు. తన తల్లిదండ్రులు కూడా తనను ఇంకా చిన్న పిల్లాడిలానే చుస్తున్నారు కానీ అప్పుడప్పుడూ పెళ్లిపై చిన్న చిన్న హింట్స్ ఇస్తుంటారని చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా తనకు కాబోయే వైఫ్ ఎలా ఉండాలనే విషయం కూడా ప్రస్తావించారు . సెన్సాఫ్ హ్యూమర్‌తో పాటు దయాగుణం ఉండే అమ్మాయిలంటేనే తనకు ఇష్టమని చెప్పారు. తనతో జీవితం పంచుకునే భాగస్వామి తననెప్పుడూ నవ్విస్తూనే ఉండాలని అన్నారు. ఎంతలా అంటే ఇంట్లో ఆమెతో గడిపే ప్రతి రోజు ఓ హాలిడేలా గడిచిపోవాలని, అస్సలు బోర్ కొట్టొద్దని చెప్పారు. తనకు ఫ్యామిలీ లైఫ్ అంటే చాలా ఇష్టమని, వ్యక్తిగా మరింత పరిణితి చెందాక పెళ్లి గురించి ఆలోచిస్తానని అన్నారు విజయ్ దేవరకొండ.