Telangana
ప్రకటన జారీ చేసి..చేతులు దులుపుకోవడం సమంజసంకాదు
Kalinga Times , Hyderabad ; ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలసకూలీలు స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతినిస్తూ కేంద్రం చేసిన ప్రకటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ స్పందించారు. కేంద్రం సడలింపుల ప్రకటన జారీ చేసి..చేతులు దులుపుకోవడం సమంజసంకాదన్నారు. ప్రధాని మోదీ స్పందించి వలస కార్మికుల తరలింపునకు..ఉచితంగా రైళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కూలీలను గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత కేంద్రమే తీసుకోవాలని మంత్రి తలసాని అన్నారు.