Telangana

రిపోటర్లకు నిత్యావసర వస్తులు పంపిణీ

Kalinga Times , Medchal ; మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని పగిడిశీల ఫంక్షన్ హాల్ లో TUWJ మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మర్రి లక్ష్మణ్ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అధినేత  మర్రి రాజశేఖర్ రెడ్డి సహాయ సహకారాలతో 300 వందల మంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్టులకు బియ్యం తదితర నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెరాసా పార్టీ మేడ్చల్ పార్లమెంట్ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి  మాట్లాడుతూ సమాజంలో ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోకుండా నిరంతరం కృషి చేసే ఉద్యోగులు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జర్నలిస్టులే అని గుర్తుచేశారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున వేళ వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, మరియు జర్నలిస్టులు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. గల్లీనుండి ఢిల్లీ వరకు ఆపైన విశ్వవ్యాప్తంగా ఉన్న వార్తలను సేకరించి ప్రజలకు అందించే జర్నలిస్టులు లాక్ డౌన్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడకూడదని వారికి నిత్యావసరాల సరుకులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత కొన్ని రోజులుగా మేడ్చల్, షామీర్పేట్ ఘట్కేసర్ బోడుప్పల్, మండలాలలో బొమ్మ అమరేందర్ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ బియ్యం, పప్పు, నూనె, కారం తదితర నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ వచ్చామని అందులో భాగంగానే ఈరోజు కీసర మండలం మరియు జవహార్ నగర్ లోని జర్నలిస్టులకు  నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం  టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బొమ్మ అమరేందర్ మాట్లాడుతూ మా జర్నలిస్టుల బాధలను తెలిపిన వెంటనే మమ్మల్ని గుర్తించి వందల మంది విలేఖరులకు నిత్యావసర సరుకులను అందించినందుకు మర్రి రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.* ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే గౌరవ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బొమ్మ అమరేందర్, IJU జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి,  నాగారం చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, దమ్మాయిగూడా చైర్మన్ వసుమతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ కీసర సర్పంచ్ నాయకపు మాధురి, తదితరులు పాల్గొన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close