
Kalinga Times, Hyderabad : వాలెనియన్ రచయితైన విసెంటే క్లావెల్ ఆండ్రెస్ కు పుస్తక దినోత్సవం జరపాలని మొట్టమొదటగా ఆలోచన వచ్చింది. ప్రపంచ రచయిత మిగ్యుఎల్ డి సెర్వంటెస్ పుట్టిన తేది అక్టోబర్ 7 గానీ, మరణించిన తేది (ఏప్రిల్ 23)గానీ పుస్తక దినోత్సవంగా చేసి ఆయనకు గౌరవాన్ని అందించాలనుకున్నాడు. అయితే, విలియం షేక్ఫ్ స్పియర్, గార్సియాసా డి లా వేగా వంటి రచయితలు మరణించిన తేది, అనేక ఇతర రచయితల పుట్టిన, మరణించిన తేది ఏప్రిల్ 23వ తేది అవడంవల్ల 1995, ఏప్రిల్ 23న తొలిసారిగా ప్రపంచ పుస్తక దినోత్సవంను నిర్వహించింది