Telangana
కొండపాక మండలం లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
Kusuba Srinivas Rao, Siddipet: కొండపాక మండలం లోని రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల లోనే విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రైతులకు సూచించారు . మంగళవారం మండల పరిధిలోని PACS ద్వారా కుక్కునూరు పల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు ..రైతులకు గిట్టుబాటు ధర చెల్లించడానికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ, 1835, సాధారణ రకానికి రూ, 1815 చెల్లించడం జరుగుతుందన్నారు. ఆరాబోసిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రం తీసుకురావాలన్నారు కొనుగోలు కేంద్రం వద్ద రైతులు భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. రైతులకు ఎలాంటి సమస్యనైనా స్పందించాలి అని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి . డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి. గజ్వేల్ rdo విజయేందర్ రెడి , డాక్టర్ యాదవ రెడ్డి రైతు బంధు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవి రవీందర్ ఎంపీపీ ర్యాగల సుగుణ. జడ్పీటీసీ అనంతుల అశ్విని ప్రశాంత్ గారు , రైతు బంధు మండల కన్వీనర్ ర్యాగల దుర్గయ్య . తహసీల్దార్ రామేశ్వర్ , pacs వైస్ ఛైర్మన్ అమరెండర్, స్థానిక సర్పంచ్ పోల్కంపల్లి జయంతి నరేందర్, ఎంపీటీసీ బురమఇన భూములుగౌడ్ , బొబాయి పల్లి సర్పంచ్ కోళ శ్రీనివాస్ , .PACS.డైరెక్టర్లు మధుసూదన్రెడ్డి, నరసింహాచారి, PACS సీఈవో శ్రీనివాస్, సిబ్బంది రాకేష్ ఉపసర్పంచ్ బాలాగౌడ్ .మాజీ సర్పంచ్లు ఐలం యాదవ్ కాసం నవీన్ . మాజీ ఎంపిటిసిలు కోల సద్గుణ , రైతు బంధు , తెరాస నాయకులు ,
మండల అధికారులు, రైతులు పాల్గొన్నారు..