Telangana
సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన బాల్క సుమన్
Kalinga Times,New Chennur : చెన్నూర్ శాసన సభ్యులు బాల్క సుమన్ సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. చెన్నూర్ అసెంబ్లీ నియోజక వర్గంలోని 113 మంది కళ్యాణ లక్ష్మి,శాదీ ముభారక్ లబ్దీదారులకు చెక్కులు చెక్కులు అందజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యం.ఎల్.ఎ క్యాంప్ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో చెక్కులని అందజేయడం తో పాటు వారికి పెల్లి కానుక గా తన సొంత ఖర్చులతో మంచి నాణ్యమైన చీరలని కూడా బహూకరించారు.అనంతరం మహిళలతో కలిసి సామూహిక భోజనం చేశారు.దీనితో ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలు సంతోషంతో బాల్క సుమన్ ఔదర్యాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి మరియు జడ్.పి చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ,యం.ఎల్.సి పురాణం సతీష్ , ఐసిడియస్ కో ఆర్డినేటర్ అత్తి సరోజన , జిల్లా గ్రంథాలయాల చైర్మన్ ప్రవీణ్ ,చెన్నూర్ భీమారం,జైపూర్,కోటపల్లి,మందమర్రి మండలాల తహశిల్దార్ లు,యం.పి.పి లు,జడ్.పి.టి.సి,యం.పి.టి.సి సభ్యులు,సర్పంచ్ లు పాల్గొనటం జరిగింది