Telangana
మహమ్మారిని జిల్లా సరిహద్దుల్లోకి రాకుండా కట్టుదిట్టం చేసిన హరీష్
కరోనా పై హరీష్ మార్క్ వ్యూహం
Kusuba Srinivas Rao Siddipet, Kalinga Times, Siddipeta : సిద్దిపేట జిల్లాలోని అన్నీతానై ప్రపంచవ్యాప్తంగా హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారిని జిల్లా సరిహద్దుల్లోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం లో హరీష్ మంచి విజయాలను సాధించాడని జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికలప్పుడు కనిపించే నాయకుల్లా కాకుండా నిత్యం జనాన్లో కనిపించే ప్రజా హృదయాలను గెలిచిన నాయకుడు హరీష్ రావు. నాయకుడు అంటే ఇలానే వుండాలి అని అనిపించే హరీష్ రావు. ఇలాంటి విపత్కర సమయం లో కూడా గడియారం, కూడా ఈర్ష్య పడే విధంగా స్థానిక నాయకులను ఎప్పటికప్పుడు సమన్వయ పరుస్తూ జిల్లా మారుమూల గ్రామాల్లో కూడా అధికార యంత్రాంగం చర్యలు తీసుకొనేలా ఒక్కొక్క అధికారిని నియమిస్తూ , ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తూ సేవలు అందేలా ఒక సైనికుడిలా ఎలాంటి ఆయుధాలు లేకుండా యుద్ధం చేశాడు … ఇటు ప్రజా బలం అటు ,అధికార బలం సరిచూస్తూ ,ప్రజాప్రతినిధులను ఏకం చేసి ప్రతీ రోజు రివ్యూ చేస్తూ, మరింత ఉత్సాహపరుస్తూ ముఖ్యమంత్రి ఆలోచనలకు అణుగుణంగా హరీష్ మార్క్ వ్యూహం గొప్ప ఫలితాన్నిచ్చింది. ముఖ్యమంత్రి కె.సి.ఆర్ దృష్టి మళ్లించింది. మిగతా జిల్లా కంటే పోలిస్తే మన జిల్లా కేవలం ఒకేఒక్క పాజిటివ్ కేసు నమోదు అయింది అతను కూడా ముఖ్యమంత్రి జిల్లా కావడం తో ఎలాంటి ఆలస్యం లేకుండా అతనిని సకల సదుపాయాలతో చికిత్స ప్రభుత్వం అందిస్తుంది ఇటు కరోనా ప్రాలదోయడంతో పాటు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రైతులకు ధాన్యం కొనుగోలులో జిల్లా లో 350 పైచిలుకు వడ్ల కొనుకోలు కేంద్రాలను సమ్యద్దాం చేసారు తొలుత స్వయంగా కేంద్రాలను ప్రారంభించి కొనుగోలు కి తెచ్చారు శనిగలు, మక్కలు కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించారు. పేదలకు నిత్యావసర సరుకులు అందిచడం లో ప్రజాప్రతినిధులను ఇప్పటికే రంగం లోకి దింపిన మంత్రి హరీష్ రావు సమస్య జటిలం కాకుండా చూశారు..ఇతర రాష్ట్ర ల కార్మికులను గుర్తించి వారికీ తక్షణ సహాయం అందించారు. ప్రభుత్వ మరియు దాతల సహకారం తో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసాడు. పోలీస్ శాఖ ను సన్నధం చేయడం లో వసతుల సమకూర్చడం లో కొంత మేరకు తన సొంత నిధులను కూడా సమకూర్చాడ ని జిల్లా నాయకులు చర్చించుకోవటమే కాదు మీడియా ముందుకూడా ప్రస్థావనకు వచ్చినట్లు తెలిసింది.