Telangana
వడగళ్ళ వానతో పంట నష్టం
kalinga Times , Siddipet : సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలం లోని అంకిరెడ్డి పల్లి లో శుక్రవారం కొండపాక తహసీల్దార్ పరమేశ్వర్ , స్థానిక రైతు సమితి మండల అధ్యక్షుడు దుర్గయ్య, రైతు నరసింహ రెడ్డి పర్యటించి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మూడు ఎకరాల వరి పంట, రాత్రికి కురిసిన వర్షానికి నష్టపోయింది , ఒక ఎకరా టమాటో కూడా నష్టపోయింది మీ వరి పంట వద్దకు వ్యవసాయ అధికారులు వచ్చి నష్టాo వివరాలు రాసుకుంటారు అని రైతుకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమం లో రైతు సమితి నాయకులు యాదం రావు, స్థానిక నాయకులు నర్సింలు, PACS డైరెక్టర్ వెంకటేశం, పంచాయతీ సభ్యుడు గాలి బాలయ్య, నాయకులు రాసుల శ్రీనివాస్, కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు