Telangana
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే కఠిన శిక్ష
kalinga Times,Hyderabad : పడితే అక్కడ ఉమ్మివేస్తే ఆ తుంపర్లు ద్వారా వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే కఠిన శిక్షలు విధిస్తామంటూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎ. శాంతికుమారి బుధవారం ఓ సర్కూలర్‌ను జారీ చేశారు. రోడ్లు, సంస్థలు, కార్యాలయాలు, మార్కెట్లు, జనసంచారం కలిగిన ప్రదేశాల్లో ఉమ్మివేస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. కొవిడ్ నియంత్రణలో బాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశా రు. వైరస్ వ్యాప్తిని అరికట్టే భాగంలో వ్యక్తిగత, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత తప్పనిసరి అని, అనారోగ్యకరమైన అలవాట్లను మానుకొని ప్రజలంతా ఆరోగ్యంగా తయారుకావాలని అధికారులు సూచించారు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేస్తే ఆ తుంపర్లు ద్వారా వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉన్నందున ప్రభు త్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విదేశాల్లో ఈ నిబంధనలు అమలవుతుండగా తాజాగా కొవిడ్ ప్రభావంతో రాష్ఱ్రంలో తొలిసారిగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చాలా మంది వాళ్లకు ఏం బాధ్యత లేనట్లు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేస్తుంటారు. ఎవరు ఏమీ అనరు అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంటుంది. బాధ్యత మరచి విచ్చలవిడిగా ఉమ్మేస్తుంటారు. కానీ ఈ సారి అలా వ్యవహరించే వారికి ప్రభుత్వం చెక్ పెడుతుంది. జీహెచ్‌ఎంసి, పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక టీంలు కూడా ఉమ్మేసిన వారిని గుర్తిస్తాయని అధికారులు వెల్లడిస్తున్నారు. పరిశుభ్రతే వైరస్ నిర్మూలనకు ప్రస్తుతం ముందస్తు వ్యాక్సిన్ కావున ప్రజలు దీన్ని పాటించాలని అధికారులు కోరుతున్నారు. ఈ విషయంలో చాలా సీరియస్ యాక్షన్లు కూడా ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా సమాజ హితం కోసం ఆలోచింది ఈ నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని అధికారులు వెల్లడిస్తున్నారు. రాష్ట్రం వ్యాప్తంగా ప్రస్తుతం చాలా మంది పాన్, గుట్కా, పొగాకు ఇతర ఉత్పత్తులను నమిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తున్నారు. ఇంకొందరైతే వాహనాల మీద కూడా వెళ్తూ రోడ్లపై ఉమ్మేస్తున్నారు.దీంతో ఆ తుంపర్లు ద్వారా ఇతరులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ముందస్తు జాగ్రత్తలతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మిన తుంపర్లను తొక్కిన వారికి కూడా ఇన్ఫెక్షన్లు ప్రబలే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.