Telangana
లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి తెలంగాణలో క్రైమ్ రేట్ పడిపోయింది.
Kalinga Times, Hyderabad : లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి నేటి వరకు తెలంగాణలో క్రైమ్ రేట్ 56 శాతానికి పడిపోయింది. మార్చి 1 నుంచి మార్చి 21 మధ్య తెలంగాణలో 48 హత్య కేసులు నమోదుకాగా.. మార్చి 22 నుంచి ఇప్పటి వరకూ 12 మర్డర్ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్, ఆదిలాబాద్ , సూర్యాపేట్ జిల్లాల్లో ఎక్కువగా నేరాలు నమోదైనట్లు పోలీసు శాఖ గుర్తించింది. రాష్ట్రంలో దొంగతనాలు భారీగా తగ్గాయి. చోరీ కేసులు సుమారు 94 శాతం పడిపోవడమే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. కిడ్నాప్ కేసులు 90 శాతం, మిస్సింగ్ కేసులు 75 శాతం మేర తగ్గాయి. అయితే లాక్డౌన్ కేసులు మాత్రం భారగా పెరిగాయి. అయితే వాటి స్థానంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై పెట్టిన కేసులు మాత్రం 98 శాతం పెరగడం గమనార్హం.