
Kalinga Times,Godavarikhani : గోదావరి ఖనిలో సింగరేణి కార్మికుడు గల్లంతయ్యాడు. 11 ఇంక్లైన్ బొగ్గుగనిలోని నాలుగవ సీమ్, 1 డిప్ వద్ద మోటార్ రన్ చేయడానికి సంజీవ్ అనే కార్మికుడు వెళ్లాడు. అయితే మళ్లీ తిరిగి రాలేదు. దీంతో అధికారులు సంజీవ్ కోసం తీవ్రంగా గాలించారు. మంగళవారం రాత్రి జీఎంతో సహా అధికారులంతా కలిసి గనిలో వెతికారు. అయినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. అయితే గని లోపల సంప్‌లో పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. కాగా, సంజీవ్ గల్లంతుపై రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకుంటున్నారు.