National

భారత్‌లో లాక్ డౌన్ కొనసాగిస్తే తీవ్ర పరిణామాలేనా ?

Kalinga Times, Hyderabad : కోవిడ్ 19ను ఎదుర్కోవడానికి మోదీ సర్కార్ లాక్ డౌన్ కూడా ప్రకటించింది. ఏప్రిల్ 14 వరకు ఇది అమలులో ఉంటుంది. తర్వాత దీన్ని కొసాగిస్తారా? లేదా? అనేది ఎవ్వరికీ తెలీదు. అయితే కరోనా లాక్‌డౌన్‌పై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తన బ్లాగ్‌లో స్పందించారు.  భారత్‌లో లాక్ డౌన్ కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆదాయం కోల్పోయి సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ పొడిగిస్తే.. ప్రజలు ఊరుకోరని అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ నిబంధనలను ధిక్కరిస్తారని, ఎదురుతిరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాజన్ కేంద్రానికి హెచ్చరికతోపాటు పలు కీలక సూచనలు కూడా చేశారు. లాక్ డాన్ తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే మోదీ సర్కార్ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.2008 ఆర్థిక మాంద్యం తర్వాత క్రమంగా బలపడుతూ వచ్చిన దేశ ఆర్థిక వ్యవస్థపై ఇప్పుడు కరోనా వల్ల ప్రతికూల ప్రభావం పడిందని రాజన్ తెలిపారు. సరైన నిర్ణయాలతో అందుబాటులోని వనరులతో కోవిడ్ 19 ప్రభావాన్ని చిత్తుచేయొచ్చని పేర్కొన్నారు.  ప్రధానమంత్రి కార్యాలయం నుంచే అన్ని పనులు జరగాలని భావించడం వల్ల లాభం ఉండదన్నారు. ఆయా రంగాల్లో నిష్ణాతులను, ఆర్థిక సంక్షోభ సమయాల్లో సేవలందించిన అనుభజ్ఞులు విపక్షాల్లో ఉన్నారని, వారందరినీ అభిప్రాయాలను కేంద్రం తీసుకోవాలని పేర్కొన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close