National
దక్షిణ కశ్మీర్‌లో భద్రత దళాల ఆపరేషన్
Kalinga Times, News Delhi : శనివారం వేకువజామున కుల్గామ్ జిల్లా హర్దమంగూరి బతాపొరా వద్ద ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయి. ఇండియన్ ఆర్మీ రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి నిర్బంధ తనిఖీలు నిర్వహించారు.ఈ సమయంలో భద్రత దళాలపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు జరపడంతో ఇరు వర్గాల మధ్య హోరాహోరీ పోరు నెలకుంది. ఆదివారం కెరాన్ సెక్టార్‌లో మరో ఐదుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు తుదముట్టించాయి. ఈ ఘటనలో ఓ జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. కుల్గామ్‌లో హిజ్బుల్ ముజాయిద్దీన్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున కెరాన్ సెక్టార్‌లో ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ముష్కరుల చర్యలను సమర్ధంగా తిప్పికొట్టింది.