Telangana
కె.సి.ఆర్ ముందుచూపు…దేశ వ్యాప్తంగా ప్రశంసలు
Kalinga Times, Hyderabad : కరోనా ప్రభావం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విదేశీ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి.రైతులు పంట చేతికి వచ్చే సమయానికి కోలుకోని విధంగా దెబ్బ తీసింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.అయితే ఈ విషయం తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. అందుకే తెలంగాణలో పండిన పంటను తెలంగాణలోని పూర్తిస్థాయిలో వాడుకునే విధంగా కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. విపత్తు కారణంగా నిత్యావసరాలకు డిమాండ్ ఎక్కువ అయ్యింది.మరోవైపు దేశవ్యాప్తంగా ధరల పెరుగుదల కూడా పెరుగుతూ సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి రాలేదు అదుపులోకి వచ్చిన దాని ప్రభావం రెండు మూడు నెలలపాటు ప్రజలపై తప్పకుండా ఉంటుంది. అందుకే ఇతర రాష్ట్రాలకు ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి ఎగుమతులు చేయకూడదని కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో బియ్యం, మొక్కజొన్న వినియోగం ఎక్కువ ఉంటుంది. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తే ఆ తర్వాత తెలంగాణలో కొరత ఏర్పడుతుందని, అందుకే తెలంగాణ లో పండిన పంటను ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసే విధంగా కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. దూరదష్టితో కెసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణలో ప్రశంసలు వస్తున్నాయి. ఇదే కాకుండా అన్ని విషయాలను కేసీఆర్ ముందస్తుగా గా ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా వారికి సూచనలు కూడా ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఈ వైరస్ ను తక్కువ అంచనా వేయవద్దని పూర్తిస్థాయిలో దీనిని కంట్రోల్ చేసేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పని చేయాలంటూ కేసీఆర్ పదేపదే పిలుపునిస్తున్నారు.ఏపీ తో పోలిస్తే తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతున్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా కెసిఆర్ ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. దటీజ్ కె.సి.ఆర్