National
ఒక్క నెల ఈఎంఐలు ఆపండి మోదీగారు’
Kalinga Times,New Delhi : బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ పోస్టు వీరి కలతను కళ్లకు కట్టింది. ‘‘వారం కాదు నెల రోజులు ఇంట్లో ఉంటాం.. దేశం కోసం బయటకు రాకుండా…కానీ ఒక్క నెల ఈఎంఐలు ఆపండి మోదీగారు’ అంటూ ఓ సగటు జీవి ఆ పోస్టులో కోరుకొన్నారు. నెల సంపాదన ఆధారంగా చాలామంది గృహాలు, గృహోపకరణాలు, వాహనాలను ఈఎంఐ విధానంలో తీసుకొన్నారు. ప్రతి నెలా వాయిదా పద్ధతిలో ఆ మొత్తాన్ని కొంత కొంతగా తీర్చుకొంటున్నారు. అయితే, కరోనా వ్యాప్తితో ఈ నెలంతా పనులే లేవు. కార్ఖానాల నుంచి ఇంటి కట్టుబడి కూలి పనుల దాకా అన్నీ బంద్! కాస్త దూరం పోయి దొరికిన పని ఏదో చేసుకొందామన్నా రవాణా అంతా స్తంభించిపోయింది! వారం రోజులుగా అయితే.. అసలు బయటకు వచ్చే దారులన్నీ మూసుకుపోయాయి.
ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ నెల మొదటి వారం తాము కట్టాల్సిన ఈఎంఐలు గుర్తొచ్చి కూలీలు, సగటు మధ్యతరగతి జీవులు కలవరపడుతున్నారు. వాటిని మే నెల వరకయినా, ఒక్క నెలపాటు రీషెడ్యూల్ చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ గండం నుంచి తప్పించాలని వారంతా కోరుతున్నారు.
దీనిపై ఫైనాన్షియల్ సంస్థలకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి, కిస్తీల కోసం వేధించకుండా చూడాలని కూడా అభ్యర్థిస్తున్నారు.