Kalinga Times,Hyderabad : తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించినా.. హైదరాబాద్ నగర ప్రజలు మాత్రం తీరు మార్చుకోవడంలేదు. పోలీసులు, మీడియా ఎంత అవగాహన కల్పించినా జనం రోడ్డెక్కుతున్నారు. యథేచ్చగా బైక్‌లు, ఆటోలు, కార్లలో తిరుగుతున్నారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రోడ్లపై వాహనాలను సీజ్ చేస్తున్నారు. దీంతో వాహనదారులు పోలీసుల ఎదుట ఓవరాక్షన్ చేస్తున్నారు. ఆస్పత్రులకు వెళ్లాలంటూ పాత ప్రిస్కిప్షన్లు చూపిస్తున్నారు.
లాక్‌డౌన్‌ను అతిక్రమించిన వారిపై పోలీస్ శాఖ సీరియ్‌స్ గా వ్యవహరించనుంది. రాష్ట్రంలో సోమవారం 2 వేల కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 900కు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. రాచకొండలో 105, సైబరాబాద్‌లో 250 కేసులు నమోదయ్యాయి. బ్లాక్ మార్కెట్‌పై ప్రతి జిల్లా పరిధిలో ఫిర్యాదులు స్వీకరించేందుకు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.