
Kalinga Times,Hyderabad : కరోనా ఎఫెక్ట్ తెలంగాణలో పదవతరగతి పరీక్షలపై పడింది. పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్ట్ ఆదేశించింది. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. అయితే, హైకోర్ట్ మాత్రం పిల్లల ఆరోగ్యం రీత్యా పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలన్నీ రీషెడ్యూల్ చేయాలని కోర్టు ఆదేశించింది. రేపు జరగాల్సిన పరీక్ష యధాతదంగా నిర్వహించాలని కోర్టు తెలిపింది. ఈ నెల 19 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి.