Telangana
సహాయ కోసం ఎర్రజెండా వాడు … ఓటు మాత్రం డబ్బులు పంచే వాడికా ?
ఒక సారి ఆలోచించండి ...సి.పి.ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి గౌతం గోవర్ధన్
Kalinga Times ,Godavarikhani : సమస్యలపై ఎర్రజెండా నాయకులతో పోరటానికి మద్దతిచ్చే జనం ..ఎన్నికలు వచ్చినపుడు మాత్రం డబ్బు పంచే నాయకులకు అందలం ఎక్కిస్తున్నారని సి.పి.ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి గౌతం గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు . కళింగ టైంస్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడుతూ..తన మనోభావాలను వెల్లడించారు. తెలంగాణ వచ్చిన అనంతరం అధికార దాహంతో ప్రతి పక్షాలను అణగదొక్కే కె.సి.ఆర్ ప్రణాళికలో బాగంగా అన్ని పార్టీలు తమ ఉనికిని కోల్పోయాయి.కమ్యూనిస్టుల భావజాలాన్ని,ఎర్ర జెండా సైనికులను మాత్రం కె.సి.ఆర్ కదిలించలేక పోయారన్నారు.కాని ప్రజలను మాత్రం వివిధ రకాల పథకాలతో ప్రభావితం చేస్తూ..విచ్చలవిడిగా ప్రజా ధనాన్ని తమ నాయకులకు అప్పనంగా దోచిపెడుతున్నారని విమర్శించారు.ఇపుడిపుడే ప్రజలకు కె.సి.ఆర్ ధన దాహం,అధికార వ్యామోహం గూర్చి తెలుస్తొందన్నారు. ఇకనైనా ప్రజలు డబ్బు వెదజల్లి గెలవాలనుకొనే వారిని గూర్చి ఒక సారి ఆలోచించు కోవాలి ?ఎవరు తమతో ఉండి పోరాటానికి ముందుంటారో వారిని గెల్పించుకోవాలన్నారు.ఈ ముసిపల్ ఎన్నికల్లో సి.పి.ఐ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికలలో సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ ప్రజాసంఘాల శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. రామగుండం కార్పోరేషన్ లో నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు దాదాపు పది నుండి ఇరవై డివిజన్లో పోటీకి సిద్ధం అవుతున్నారని వారు పేర్కొన్నారు. ఎన్నికలు రాగానే అధికార పార్టీ నాయకులకు ప్రజలు గుర్తుకు వస్తారని సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే వారికి ఆట్టి సమస్యలు కనపడవు అని ఎద్దేవ చేశారు.
కమ్యూనిస్టు పార్టీ నాయకులను ఆదరించి కార్పొరేటర్గా గెలిపించాలని వారు పిలుపునిస్తూ కమ్యూనిస్టు పార్టీ నాయకులు కార్పొరేటర్ గా గెలిస్తే ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడి నిలదీసి ప్రశ్నించే గొంతుకలు అవుతారని వారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నటువంటి సిపిఐ నాయకులను కార్పొరేటర్లు గా గెలిపించాలని వారు పిలుపునిచ్చారు.