National
కశ్మీర్ పరిణామాల్లో భాగంగా ద్వైపాక్షిక సంబంధాలకు పాక్ చెక్

Kalinga Times, New Delhi : కశ్మీర్ పరిణామాల్లో భాగంగానే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటి సమాశమైంది. ఈనేపథ్యంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రెండు దేశాల మధ్య వ్యాపార మార్గమైన వాఘా సరిహద్దును మూసి వేయాలని కమిటి నిర్ణయించింది. మరోవైపు ఆయా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు కూడ చెక్ పెట్టింది. దీంతో భారత రాయబారిని బహిష్కరించింది. భారత్‌లో ఉండాల్సిన పాకిస్థాన్ రాయబారిని పంపకూడదని కూడ నిర్ణయించింది. భారత హై కమీషనర్‌ను బహిష్కరించిన నేపథ్యలోనే రాయబారిని వెనక్కి వెళ్లాలని కోరనుంది. ఇక ప్రస్థుతం పాకిస్థాన్ మూసివేసిన మూడు ఎయిర్ రూట్స్‌ను నిషేధించడం వల్ల తమకు ఎలాంటీ ఇబ్బంది లేదని భారత దేశం పేర్కోంది. నిషేధించిన ఒక మార్గం వల్ల కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే దూరం పెరుగుతుందని తెలిపారు. కాగా అంతకు ముందు భారత దేశం బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ నిర్వహించిన తర్వాత ఆదేశ గగనతలంపై విమాన రాకపోకలను పాకిస్థాన్ కొద్ది రోజుల పాటు నిషేధించి ఇటివల నిషేధాన్ని తోలగించింది. కాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ బిష్కేక్ సమావేశాలకు వెళ్లే సమయంలో కూడ ఆదేశం గుండా వెళ్లకుండా ఇతర మార్గం ద్వార వెళ్లిన విషయం తెలిసిందే.