social
ఆన్ లైన్ షాపింగ్ ద్వారా మోసాలు
Kalinga Times,Hyderabad : ఆన్‌లైన్ మార్కెటింగ్ విధానం క్రమంగా రోజురోజుకు పెరుగుతుంది. ఇంట్లో కూర్చునే మార్కెట్‌లో ఉన్న వస్తువులను నేరుగా తెప్పించుకోవడం నగరవాసులకు, ముఖ్యంగా యువతకు ఇది ట్రెండ్‌గా మారింది. ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా వ్యక్తిగత సమాచారంతో పాటు, బ్యాంక్ తదితర విషయాలను వెబ్‌సైట్‌లో పొందుపరుచుతున్నాం. దాంతో నేరగాళ్లకు ఆ వివరాలను ఆసరగా చేసుకొని ఆ వ్యక్తి పేరిట కొత్త అకౌంట్లు తెరవడం, క్రెడిట్ కార్డులు తీసుకోవడం సాధ్యమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కీబోర్డు మీద మనం టైప్ చేసే వివరాలను ట్రోజూన్ హార్స్ అనే వైరస్ రికార్డు చెసే నేరగాళ్లకు సహకరిస్తుంది.