Telangana
కేసు పెడితే కాలనీలో బతకలేరు మీరు..
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాలనీవాసుల పై దౌర్జన్యం

Kalinga Times, Kapra : కాప్రా మండల్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీ నల్ల పోచమ్మ దేవాలయం వద్ద నవీన్.రాజేష్ అనే యువకులు వాళ్ల ఆడవాళ్ళ తో కలిసి వారి ఒక గ్యాంగుగా మారి కాలనీవాసుల పై దౌర్జన్యం చేస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని కాలనీవాసులు వాపోతున్నారు. మద్యం గంజాయి లాంటి మత్తు పదార్థాలు వాడుతూ కాలనీవాసులను భౌతికంగా గాయ పరుస్తూ, భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని వారు వాపోయారు. గతంలో వారి పైన అనేక క్రిమినల్ కేసులున్నాయని పోలీసులు వారిని కఠినంగా శిక్షించి కాలనీవాసులను రక్షించాలని కోరారు. వాళ్లపై పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు పెట్టిన వారి ఇంటికి వెళ్లి ఫ్యామిలీని బెదిరించి కేసు వాపసు తీసుకోవాలని బెదిరిస్తూ మళ్లీ కాలనీలో తిరగకుండా చేస్తానని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తమ ఆవేదనను వెళ్ళబుచ్చారు.
అక్రమ బెల్ట్ షాప్
అదే కాలనీలో ఓ వ్యక్తి బెల్ట్ షాప్ నిర్వహిస్తూ అక్రమంగా మందు బాటిల్ నమ్ముతున్నారు. ఈ బెల్ట్ షాప్ అక్కడ ఉండడం వల్లనే అరాచకాలకు కారణం అవుతోంది.. వాళ్లకి అనుకూలంగా మారుతుంది.దీనిపై ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోకపోవడం. మామూలు మత్తులో మునిగి తేలుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇళ్ళ మధ్యనే ఇలాంటి బెల్ట్ షాప్ లు ఉండడం దానిని అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఏరియాలో రోజు,రోజుకు గుండాయిజం పెరిగిపొతోంది.
పట్టించుకోని పోలీసులు
జవహర్ నగర్ పోలీసులకు ఫోన్ చేయగా పెట్రోలింగ్ వెహికల్ వచ్చి ఏం జరిగిందో తెలుసుకొని వెళతారే తప్ప చర్యలు మాత్రం తీసుకున్న దాఖలాలు లేవు .