Religious
కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయ దర్శనం
Kalinga Times.Hyderabad : సుబ్రహ్మణ్య స్వామి స్వయంభువుగా వెలిశాడు. ఈ ఆలయానికి స్థల పురాణం ఉంది. పూర్వం తారకుడు, సూర్పర్మాసురా అనే అసురులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తి ఆయుధంతో సంహరించాడు. తన ఆయుధాన్ని ఇక్కడి ధారానదిలో శుభ్రపరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తరువాత కుమారధార పర్వతశ్రేణులలో గణపతి మున్నగు దేవతలతో కుమారస్వామి విశ్రాంతి తీసుకున్న సమయంలో ఇంద్రుడు తన కుమార్తెను వివాహం చేసుకొమ్మని కోరగా ఆయన అంగీకరిస్తాడు. ఆ తరువాత వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో తనతో పాటు వెలియడానికి అంగీకరించటం వల్ల ఈ క్షేత్రం వెలసింది.