Andhra Pradesh
ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు సమీపంలో కార్డెన్ సెర్చ్
Kalinga Times ,Amaravati : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు సమీపంలో గంజాయి కలకలంరేపింది. తాడేపల్లి కేఎల్‌రావు కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ ఈశ్వర్ రావు ఆధ్వర్యంలో 100 పోలీసులు ఈ సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 9 బైక్‌లు, ఓ ఆటో సీజ్ చేశారు. అలాగే 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని.. నలుగు యువకుల్ని అరెస్ట్ చేశారు. ఒక స్విఫ్ట్ కార్ స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రితో పాటూ అనేకమంది వీఐపీలు నివాసాలు ఉన్న ప్రాంతం కావడంతో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలుస్తోంది.