National
అన్ని అంశాలపై చర్చకు రెడి
Kalinga Times, New Delhi : పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మరికాసేపట్లో పార్లమెంటు శీతాకాల సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో సంసద్ భవన్ వద్ద ప్రధాని మోడీ మాట్లాడారు. అన్ని అంశాలపై కూలంకషంగా చర్చలు జరుపుకుందామని పేర్కొన్నారు. చర్చల్లో వాదోపవాదాలు జరిగినా సానుకూలంగా పరిష్కరించుకుందామన్నారు.