Religious
గోదావరిఖనిలో బాలోత్స వ కార్యక్రమం
Kalinga Times,Godavarikhani :తెలంగాణ భవిత బాలల చేతుల్లోనే ఉందని వారిని ప్రోత్సహించి విజేతలుగా తీర్చిదిద్దే బాద్యత మన అందరిపైనే ఉందని వర్ధమాన నటుడు బిత్తిరి సత్తి అన్నారు. శనివారం గోదావరిఖనిలో నిర్వహిచిన్ తెలంగాణ బాలోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమ ముగింపు వేడుకలకు తుపాకి రాముడు హీరో బిత్తిరి సత్తి,పెద్దపల్లి జడ్.పి చైర్మన్ పుట్ట మధు ,రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ లు పాల్గొని ప్రసంగించారు.ఈ వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమ పోటీలలో పాల్గొన్న విద్యార్థినీ,విద్యార్థులకు బహుమతులను బిత్తిరి సత్తి అందించారు.ఈ బాలోత్స్వ కార్యక్రమం లో సుమారు 300 ల పాఠశాలల విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.