Telangana
రైతులు పండించిన ప్రతి పంటకు కనీస గిట్టుబాటు ధర -మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి
Gavaala Srinivasulu ,Kalinga Times ,Secunderabad : రాష్ట్రంలోని రైతులు పండించిన ప్రతి పంటకు కనీస గిట్టుబాటు ధర చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ బోయిన్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2019-2020 దానిపై మంత్రి సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్రంలోని వ్యవసాయ కమిటీల కార్యదర్శలు ఉన్నతాధికారులు హాజరైనారు.ఏ పంటలకు ఎంతెంత కనీస గిట్టుబాటు ధరలు ఇవ్వాలనే చర్చలు జరిగాయి. సమావేశంలో పాల్గొన్న అధికారులు తమతమ అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రంలో విస్తారంగా సమృద్ధిగా వర్షాలు పడ్డారని, ఒక కోటి పదకొండు లక్షల ఎకరాలలో పంటలు పంపామని, ముఖ్యంగా వరి,మక్క జొన్న, పత్తి తదితర ప్రధాన పంటలు దిగుబడి అధికంగా ఉందని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పిలుపు ఇవ్వడం తో రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వారు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు.