Telangana
బోయిన్ పల్లి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో రైతుల ఆందోళన
Kalinga Times Gavaala Srinivasulu ,Secunderabad : కమీషన్ ఏజెంట్లు, హమాలీలు వలన తాము తీవ్రంగా నష్టపోతున్నామని తక్షణ మా సమస్యలు పరిష్కరించాలని రైతులు ఆందోళనలకు దిగి ధర్నా చేశారు. బుధవారం సికింద్రాబాద్ బోయిన్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో రైతులు ఆందోళనలకు దిగి ధర్నా చేశారు. కమీషన్ ఏజెంట్లు,హమాలీలు,అధికారులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా లకు చెందిన సుమారు వందమంది రైతుల ఇక్కడికి చేరుకుని ధర్నాకార్యక్రమమాలు చేపట్టారు.
ఈసందర్భంగా రైతులు గోవర్ధన్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ బోయిన్ పల్లి వ్యవసాయ మార్కెట్ లో కమీషన్ ఏజెంట్లు,హమాలీలు కలిసి దోపిడీ చేస్తున్నారని, తాము పండించిన పంటను 80కిలోలకు పైగా ఉన్న సంచులలో ( బస్తాలలో) నింపు కొని ఇక్కడికి తెస్తే 50కీలోలకంటే ఎక్కువ ఉంటే తాము తూకం కంట పెట్టమని,50కిలోలకంటే ఎక్కువ ఉంటే మిగితా కురగాయలు తీసివేస్తునారని, ఆమాలీలకు కమీషన్ ఏజెంట్లు మద్దతుగా వ్యవహరిస్తున్నారని దీంతో ఎంతో నష్ట పోతున్నామని వారు తెలిపారు. గిట్టుబాటు ధర దేవుడెరుగు, అధిక బరువు నెపంతో మమ్మల్ని వేధిస్తున్ననారని ఆరోపించారు తాము అనేక సార్లు సంబందిత అధికారులు. కలెక్టర్, ప్రభుత్వం దృష్టికి తెచ్చిన ఫలితం లేదని మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గోవర్ధన్ రెడ్డి అనే రైతు వెంట తెచ్చుకున్న పెట్రోలు ఒంటిపై పోసుకుని ఆత్మహత్య కు పాల్పడుతుండగా పక్కనే ఉన్న పోలీసులు, రైతులు నివారించారు. మరో రైతు సొమ్ము సిల్లగా గాంధీ ఆస్పత్రికి తరలించచారు. పరిస్థితులు చేయిదాటకుండా పోలీసు అధికారులు రైతులకు సర్ధిచెప్పారు. సమీక్ష సమావేశంలో ఉన్న మంత్రి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి తదితర అధికారులు వచ్చి రైతులను శాంత పరచారు. వారం లోపల రైతుల సమస్యలను తప్పకుండా పరిష్కారం చేస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో ఆందోళనలకు దిగిన రైతులు శాంతించారు. బేగంపేట ఏసీపీ ఎ. రామ్ రెడ్డి, తిర్మలగిరి, బొల్లారం,అల్వాల్ పోలీసులు బందోబస్తు పర్యవేక్షించారు.