Telangana

ఇచ్చిన హామీలను నెరవేరుస్తా-ఎంఎల్ఏ కృష్ణా రావు

Gavvala Srinivasulu,Kalinga Times ,Secunderabad : కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో ఏలాంటి సమస్యలు లేకుండా ఆదర్శ డివిజన్ గా తీర్చి దిద్దుతానని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తానని ఎంఎల్ఏ మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం ఉదయం ఓల్డ్ బోయిన్ పల్లి లో డివిజన్ కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై స్ధానిక కార్పొరేటర్ ముద్దు నర్సింహా యాదవ్ అధ్యక్షతన రివ్యూ సమావేశం నిర్వహించారు.ఈ రివ్యూ సమావేశానికి సమతా నగర్,భవానీ నగర్, ఎల్ బి నగర్, అంజయ్య నగర్, సిండికేట్ బ్యాంక్ కాలనీ, హస్మత్ పేట, సాయి సాగర్ ఎన్ క్లేవ్, మల్లికార్జున నగర్, తదితర ప్రాంతాల్లోని నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. కూకటి పల్లి మున్సిపల్ జోనల్ కమీషనర్ మమత, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ తదితర శాఖల అధికారులు సమావేశానికి హాజరైనారు.ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి నాయకుడు,మహిళలు సమస్యలపై ఎకరువు పెట్టారు. సమతా నగర్ కార్యదర్శి నాగేశ్వరరావు, భవాని నగర్ మహిళా నాయకురాలు శ్రీమతి బేబి సుననంద ,ఎల్ బి నగర్ నుంచి హరినాథ్,హసమత్ పేట నుంచి మైనారిటీ నాయకులు ఈ సందర్భంగా ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు, ఎంఎల్ఏ దృష్టి కి తెచ్చారు. అందరు వివరించిన సమస్యలు ఆలకించి ఎంఎల్ఏ మాధవరం కృష్ణారావు ప్రసంగిస్తూ హామీలన్నీ నెరవేర్చే గలనని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, లబ్ధిదారుల కు అందేవిదంగా చూస్తానని, త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ లను కూడా కేటాయించడం జరుగుతుంది అన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close