Telangana
హుజూర్‌నగర్‌లో భారీ విజయం దిశగా టీఆర్‌ఎస్
Kalinga Times,Huzur Nagar : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. రౌండ్ల వారీగా ఎన్నికల అధికారులు ఓట్లను లెక్కిస్తున్నారు.12వ రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి 23,821 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వెనుకంజలో ఉన్నాయి. కాంగ్రెస్ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో, టీడీపీ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి . హుజూర్‌నగర్ ఎన్నికపై ఆర్టీసీ సమ్మె ఎటువంటి ప్రభావం చూపలేక పోయింది. హుజూర్‌నగర్ ఓటర్లు ఏకపక్షంగా ప్రభుత్వంవైపు నిలబడ్డారు. దీంతో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఫలితాల్లో దూసుకుపోతోంది. అన్ని రౌండ్లలో టీఆర్‌ఎస్ ఆధిక్యతను ప్రదర్శిస్తుండడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నారు.
మరికాసేపట్లో కేసీఆర్ మీడియా సమావేశం
ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్‌ఎస్ భారీ విజయం దిశగా దూసుకుపోతుండడంతో సీఎం కేసీఆర్ ఫలితాలపై స్పందించనున్నారు. ఉప ఎన్నిక ఫలితం, విపక్షాల తీరుపై కేసీఆర్ మాట్లాడనున్నారు.