Andhra Pradesh

త్యాగం, సేవకు పోలీసులు నిదర్శనం

ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌లో2018 బ్యాచ్‌ డీఎస్పీల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ లో హోంమంత్రి

Kalinga Times ,Amaravati : సవాళ్లను ఎదుర్కొనేందుకు డీఎస్పీలు సిద్ధంగా ఉండాలని, సైబర్‌, చిట్‌ఫండ్‌, వైట్‌కాలర్‌ నేరాలపై దృష్టిపెట్టాలని ఏపీ హోంమంత్రి సుచరిత సూచించారు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌లో.. 2018 బ్యాచ్‌ డీఎస్పీల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ.. మహిళలపై దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. త్యాగం, సేవకు పోలీసులు నిదర్శనమన్నారు. గ్రామీణాభివృద్ధిలో పోలీసులు కీలకపాత్ర పోషించాలన్నారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని సుచరిత పిలుపునిచ్చారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close