Telangana
గడప దాటినోళ్లు అటే అంటున్న కేసీఆర్.. తానే గడప దాటాడు
Kalinga Times,Warangal : సీఎం కెసిఆర్ ను ఉద్దేశించి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కోదండరాం ‘మన ఓట్లకు పుట్టినోడు.. మనల్ని మనుషులం కాదంటే ఒప్పుకుంటామా? ఆర్టీసీ మనదే.. గెలుపు మనదే’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కేసీఆర్ మర్చిపోయారే తప్ప.. మనం కాదని.. ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేసిన ఆయన పోరాడి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
ఆర్టీసీ మంత్రి ఎప్పుడన్నా ఉద్యమంలో పాల్గొన్నాడా?
అని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల ఇంక్రిమెంట్స్ పాము నిచ్చెనలా జీవితకాలంలో చూడనివారు ఉన్నారని, కేసీఆర్‌కు మెఘా కృష్ణా రెడ్డి దగ్గరయ్యారని, తెలంగాణ ప్రజలు దురమయ్యారనన్నారు. గడప దాటినోళ్లు అటే అంటున్న కేసీఆర్‌కు.. తానే గడప దాటి ఉన్నారనే విషయం అర్థం కావటం లేదన్నారు. ఆర్టీసీని కాపాడుకోవడం అందరి బాధ్యతని, ఆర్టీసీ ఖర్చులకు ప్రభుత్వమే నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.