Telangana
బోయిన్ పల్లి లో ధూంధాంగా అలాయ్ బలాయ్
Gavvala Srinivasulu,Kalinga Times,Secunderabad : సబ్బండ జాతుల వర్గాల వారు సమైక్యంగా ఉంటూ తమ ఉనికిని చాటాలని బోయిన్ పల్లి యాదవ సంఘం నాయకుడు పి. అరుణ్ యాదవ్ అన్నారు. అరుణ్ యాదవ్ నేతృత్వంలో ఆదివారం ఉదయం న్యూ బోయిన్ పల్లిలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమం ధూంధాంగా జరిగింది.. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్,మరో మాజీ ఉపాధ్యక్షుడు భానుక మల్లికార్జున్, బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర రెడ్డి, పి. వెంకట్రావు, గౌడ సంఘం అధ్యక్షుడు యాదవ్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు టి. ఎన్. శ్రీనివాస,ప్రజా చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు యనమల శ్రీ నివాసం రావు, ఓల్డ్ సిటీ టీఆర్ఎస్ అధ్యక్షురాలు శ్రీమతి ఫైజా బీన్, మైనార్టీ నాయకుడు అన్నా హుస్సేన్, అజిత్, వినోద్,ఇటికె కృష్ణ, తదితర కులాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఒకరికి ఒకరు అలాయ్ బలాయ్ చేసుకున్నారు. తెలంగాణ జానపద కళాకారులు పిడమర్తి రామ్ బాబు బృందం పాడిన పాటలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నృత్యం చేసి సభికులను ఆలరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అరుణ్ యాదవ్ మాట్లాడుతూ హిమా చల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కురుమను ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమం మని తెలిపారు.ఈ సంధర్భంగా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి యేట ఈకార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అందరి హర్షధ్వానాల మధ్య తెలిపారు.