social

ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక అయిన పరాశక్తి

ప్రాణులు అన్నీ.. ఆ పరాశక్తి నుండే ఉద్భవించాయి

Kalinga Times,Hyderabad : జగత్తులో అంతర్గతంగాఉన్న మనమహర్షులు పరాశక్తిని కూడా దర్శించగలిగారు .
వివిధ శక్తులు, దేవతలు, ప్రాణులు అన్నీ.. ఆ పరాశక్తి నుండే ఉద్భవించాయి. అయినా వేటికి అవి ప్రత్యేక పనికొరకు ప్రత్యేక గుణములు కలిగి ఉంటాయి. అంటే ఒక గొలుసు లోని వేరు వేరు లింకులన్నమాట. మానవశరీరంలో ఒక్కొక్కఅవయవానికి ఒక్కొక్కస్థానము, పని ఉంటుంది. అలాగే ఈ విశ్వంలో ఒక్కొక్క దేవతకు ఉండవలసిన స్థానములు, చేయవలసిన పనులు, ప్రత్యేకంగా నిర్దేశించిఉన్నాయి.ఈ దేవతలకు యంత్రం రూపమయితే,మంత్రం నాదమవుతుంది. వేదవాక్కులచే అట్టిదేవతలు ప్రత్యక్షమవుతారని,అనుగ్రహిస్తారని, తెలుసుకొన్న మన మహర్షులు మనకు..మంత్ర, యంత్ర శాస్త్రాలను అందించారు. వేదమునకు మూలము నాదము.దాని నుండి బీజాక్షరములు ఉద్భవించి, మంత్రములుగా శక్తిని సంతరించు కున్నాయి.

యంత్రమంటే ఏమిటి ?
యంత్రమనగా ఆరాధించేదేవత యొక్క (శక్తి) స్వరూపమే. ఆ దేవతాశక్తి ఆయంత్ర రూపంలోనిక్షిప్తమవుతుంది.
మనపెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు. అవి 1)ఇచ్ఛాశక్తి, 2) జ్ఞానశక్తి 3) క్రియాశక్తి. ఏ పనిచేయాలన్నా ఆపని చేయాలనే ‘ఇచ్ఛ’ (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎట్లాచేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచన జ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరుపటమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడుశక్తుల కలయిక తప్పదు.ఈ చరాచర సృష్టి మొత్తం ఈమూడు శక్తుల కలయికే. ఈ మూడు శక్తులను సూచించే దేవతలే.. కామేశ్వరి, వజ్రేశ్వరి,భగమాలిని. శ్రీచక్రం లోని మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే. నేటి శాస్త్రజ్ఞులు కూడా, ఏపదార్థమైనా శక్తి రూపాంతరమేనని చెబుతున్నారు.


నేడుమనం చూస్తున్న విజ్ఞానశాస్త్రం ద్వారా కనిపెట్టబడిన వస్తుజాలమంతా ఈక్రియాశక్తి యొక్క రూపాంతరమే. విజ్ఞానవేత్తలైన మన మహర్షులు ఈ మూడుశక్తులు కలిసిన శక్తినే ప్రకృతి అని, పరాశక్తి అని, అవ్యక్తం..శుద్ధమాయ అని అంటారు.అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మ నిచ్చినది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక అయిన పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆపరాశక్తే ఈ జగత్తుకు మాత(తల్లి) అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకువారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తులన్నింటినీ ఆ జగన్మాత లేదా పరాశక్తి, వారికి అందిస్తోంది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close