Telangana

4 వ వార్డు బాదితులకు ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ సికింద్రాబాద్ కన్వీనర్ పరామర్శ


Reporter Mahender Kalinga Times, Malkajigiri : హైదరాబాద్,సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో కురుస్తున్న భారి వర్షాలకు జంటనగరాలు రహదారులు ఏరులై పారుతుంటే ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.ఏ సమయంలో ఏముంచుకొస్తుందోనన్న భయంతో బిక్కుబిక్కు మంటున్నారు.ముఖ్యంగా లోతొట్ట ప్రాంతాలు,అపార్టుమెంటు వాసులు,కాలవల ఇరుపక్కల నివాసం ఉంటున్న వారి భాదలు వర్ణణాతీతంగా ఉన్నాయి. గురువారం రాత్రి 12గంటల తర్వాత కురిసిన భారీ వర్షానికి బేగంపేట,రసూల్ పుర,బోయిన్ పల్లి,బాపూజి నగర్,తిర్మలగిరి,ఇందిరా నగర్,అల్వాల్,లోతుకుంట,పాత బోయిన్ పల్లి, మల్కాజి గిరి,ఆనంద్ బాగ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రాత్రి భారీ వర్షం కురిసింది దీనితో ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారు.భారీ వర్షం కారణంగా కంటోన్మెంట్ 4 వార్డు పరిధి తదితర ప్రాంతాలలో .ఎక్కడ పడితే అక్కడ మోకాలులోతు నీళ్లు నిలిచి పోయి  ఇండ్లలో ఊట బాయిలా మారడం చోటు చేసుకుంది.

వర్షానికి వచ్చిన వరద నీటితో ఇబ్బందులను ఎదుర్కొంటున్నకంటోన్మెంట్ 4 వ వార్డులో బాదితులను ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ సికింద్రాబాద్ కన్వీనర్ జి.శ్రవణ్ శుక్రవారం పరామర్శించారు.ఈ సంధర్భంగా వర్ష బాదితులు తమ బాధలను చెప్పుకున్నారు.ఇంత దారణాలు చోటు చేసుకున్న ఏ నాయకుడు ఆలకించడం లేదని బాధితులు విమర్షించు తున్నారు. ప్రభుత్వ యంత్రాంగ యుద్ద ప్రాతిపధిక చర్యలు తీసుకోకపోరడం విచారకరమని ప్రజలు వాపోతున్నారు తెల్లవార్లు వర్ద నీటితోనే గడిపామని,ఇళ్ళన్ని బుర్దమయగా మారాయని నాళాల్తో దోమలు,ఈగలు మరీ ఎక్కువయ్యాయని తెలిపారు.ఈ సంధర్భగా శ్రవణ్ మాట్లాడుతూ తాను అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టేలా కృషి చేస్తామన్నారు.అంతే కాకుండా త్వరలోనే వార్డులోని పేద వారికోసం ఆరొగ్య భీమా చేపిస్తానన్నారు.ఈ ఇన్సూరెన్స్ వల్ల కార్పోరెట్ వైద్యం పొందవచ్చన్నారు.ఈ రెండు మూడు రోజుల్లోనే కార్యాచరణ ప్రకటించి మీ అందరికి ఇన్సూరెన్స్ చేపిస్తానని హామీ ఇచ్చారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close