Telangana

కెసీఆర్ చొరవతో బతుకమ్మ చీరల తో చేనేత రంగానికి పూర్వ వైభవం

Mahender,Kalinga Times,Shamirpet: శామిర్ పేట మండలం లో అలియాబాద్ ఫంక్షన్ హాల్ లో బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమాన్నిబుధవారం శంబీపూర్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దానితో తొ పాటు యాదవులకోసం రాష్ట్ర వ్యాప్తంగా విడత గొర్రెల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు మల్లారెడ్డి,తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కెసీఆర్ చేపట్టిన పలు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుసున్నాయని కొనియాడారు. కెసీఆర్ చొరవతో బతుకమ్మ చీరల తో చేనేత రంగానికి పూర్వ వైభవం వచ్చిందన్నారు.అనతరం యాదవుల్ కోసం రెండో విడత గొర్రెల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలతో పాటు యాదవ సంఘాల ప్రతినిధులు,తెరాసా కార్యకర్తలు,నాయకులు,సంబదిత అధికారులు పాల్గొన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close