Telangana
పనులు మాత్రం సకాలంలో పూర్తి చేయాలి- మంత్రి తలసాని
Gavvala Srinivasulu Kalinga Times Secunderabad : సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలో 39లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపనలు చేశారు. బుధవారం ఉదయం డివిజన్ లోని చుట్టల బస్తీ, డీడీ కాలనీ సెయింట్ మార్క్స్ స్కూల్ , కాచి బోలు, ఓల్డ్ బోయిగూడా, హైదర్ బస్తీ లలో డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్, నాలా పూడిక తదితర అభివృద్ధి పనుల కి 39లక్షల వ్యయంతో శ్రీనివాస్ యాదవ్ పనులకు శ్రీకారం చుట్టారు. శంకుస్థాపన కార్యక్రమాలు పూరైన తర్వాత మంత్రి తలసాని అధికారులతో మాట్లాడుతూ పనులు మాత్రం సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు. చుట్టల బస్తీ గుండా వెళ్ళే ప్రధాన నాలా వద్ద 30 మీటర్ల మేర 600 యంయం డయాతో స్ట్రీమ్ వాటర్ పనులకు 8లక్షలు మంజూరైయిందని, డీడీ కాలనీ కి 6లక్షలు,కాచిబౌలిలో 2.5లక్షలు,ఓల్డ్ బోయిగూడా లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 18లక్షలు,హైదర్ బస్తీలో డ్రైనేజీ పైపులు పనులకు4.5లక్షలు మంజూరైనాయని తలసాని తెలిపారు. పనులలో ఏలాంటి జాప్యం జరిగిన సహించేది లేదని ఆయన అధికారులతో అన్నారు. మంత్రి తో పాటు స్థానిక కార్పొరేటర్ శ్రీమతి అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్, జీహచ్ఎంసి డీడీ నీటిని పద్మావతి, వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ రాజశేఖర్, డిజియం సునీల్, సెక్షన్ మేనేజర్ సురేష్,ఇంజనీరింగ్ ఈఈ వెంకట్ రెడ్డి, డీఈ ప్రశాంతి, డిప్యూటీ ఎమ్మార్వో డేవిడ్ తో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.