Telangana
ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత – కేసీఆర్
Kalinga Times,Hyderabad : హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానంలో 50వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్దిగా బరిలోకి దిగుతున్న శానంపూడి సైదిరెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు బీ ఫారం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలని కేసీఆర్ ప్రజలను కోరారు.ఇక బీజేపీకి డిపాజిట్ కూడ దక్కొద్దని ఆయన టీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు.ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.
ఎన్నికల ప్రచారంలో కూడ తాను పాల్గొంటానని కేసీఆర్ సైదిరెడ్డికి హామీ ఇచ్చారు.ఏనాడూ కూడ నియోజకవర్గాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ కు అన్ని వర్గాల నుండి ఆదరణ ఉందన్నారు.నియోజకవర్గంలోని మెజారిటీ గ్రామపంచాయితీల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులే విషయం సాధించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. కాంగ్రెస్ ఓటమి ఖాయమని తేలిందన్నారు. అయినా ఆ పార్టీ హడావుడి చేస్తోందన్నారు. తనకు టిక్కెట్టు కేటాయించినందుకు గాను సైదిరెడ్డి సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.