Telangana
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ శ్రీరామ రక్ష -ఎంఎల్ఏ కృష్ణారావు
Gavvala Srinivasulu,Kalinga Times,Secunderabad : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టి దిగ్విజయంగా అమలు చేస్తున్నారని,అదేవిధంగా నేటికి కూడా పథకాలు కొనసాగడం ప్రతి ఒక్కరు గర్విహించదగిన విషయమని కూకట్ పల్లి నియోజకవర్గం ఎంఎల్ఏ మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళ వారం నాడు ఈ నియోజక వర్గంలోని పాత బోయిన్ పల్లి డివిజన్ భాగ్యశ్రీ గార్డన్స్ లో జరిగిన బతుకమ్మ చీరెల పంపిణి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ బతుకమ్మ సాంస్కృతిని చాటి చెప్పిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని,కేసీఆర్ రెండవ సారి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ మరిన్ని పథకాలతో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ శ్రీరామ రక్ష నిలిచాడని కృష్ణారావు వివరించారు.తర్వాత ఎంఎల్ సీ నవీన్ రావు ప్రసంగిస్తు కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ కార్రక్రమానికి స్థానిక కార్పోరేటర్ ముద్దం నర్శింహా యాదవ్ అధ్యక్షత వహించారు. డివిజన్ లో 13వేల పై చిలుకు మహిళలకు చీరెలు పంచడం జరుగుతుందని అన్నారు.ఈ రోజు నుంచి 30వ తేది వరకు ఈ పంపిని చేయడం జరుగుతుందని,తమతమ రాషెన్ షాప్ కి వెళ్లి తెచ్చు కోవలసిందిగా ఈ సందర్భంగా నర్శింహా యాదవ్ విజ్ఞప్తి చేశారు.పేర్లు నమోదు అయిన వారికే చీరెలు పంచడం జరిగింది.దొరకని మహిశలు నిరుత్సాహంగా వెనదిరిగారు. మోత్తం మీద ప్రషాంత వాతవరణం చీరెల పంపిణి జరిగింది. ఈ బతుకమ్మ చీరెల పంపి ణి కార్యక్రమంలో ఎంఎల్ సి నవీన్ రావు,నగర పురపాలక సంఘం జాయింట్ కమీషనర్ శ్రీమతి మమత,కూకట్ పల్లికి చెందిన మున్సిపల్ అధికారులు,ఎంఆర్ వో గౌరీ వత్సల,సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కర్రె జంగయ్య, నంరేద్ర గౌడ్,మక్కల నర్శింగ రావు,ఎం బలరామ్,శ్రీమతి కర్రె లావణ్య,తదితరులు,కార్పోరేటర్లు నరేంద్ర చారి,బేగమ్ తో,వందలాది మంది మహిళలలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.