
అసంపూర్తి కాలువల తో నీళ్లన్నీ రోడ్ల మీదికి …. పేరుకోసం ప్రజాధనం దుర్వినియోగం
Kalinga Times, Hyderabad : అసంపూర్తి కాలువల్లోకి నీటిని వదిలి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాడని, టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి విమర్శించారు ఆదివారం నంగునూరు మండలం లోని కొన్ని గ్రామాలలో హరీష్ నీళ్లు వదిలి ప్రారంభించిన కాలువలను సోమవారం దేవులపల్లి యాదగిరి ,పరిశీలించారు అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ కోట్లరూపాయలు ఖర్చు చేసి కిలోమీటర్లనుండి తెచ్చిన సాగు నీటిని, పనులే పూర్తికాని కాలువలలోకి వదలడంతో ఆ నీలన్ని రోడ్లమీదకి బీడుభూముల్లోకి వృధాగా పారుతున్నాయని మండిపడ్డారు ఇది హరీష్ రావు బాధ్యతారాహితమని పేర్కొన్నారు . ప్రజాధనం తో నిర్మించిన ప్రాజెక్టుల లీళ్లను రైతులకు వ్యవసాయ సాగుకు ,చెరువులను నింపకుండా స్వార్థం తో సొంత ప్రచారం కోసం మిడి మిడి జ్ఞానం తో నీళ్లు వదలడం మూలాన,నీలాన్ని ,రోడ్ల పైకి బీడుభూముల్లోకి పోతున్నాయి తప్ప రైతులకు ప్రయోజనం లేదన్నారు, హరీష్ రావు సొంత డబ్బా కోసం చేసిన పని సిగ్గుమాలిన తనమన్నారు ఇలా చెయ్యడం తో ప్రజలకు రైతులకు ఆర్థిక నష్టమే ఎక్కువ అని స్పష్టంచేశారు హరిశ్ రావు జీవితంలో ప్రారంభించిన పనులు మొత్తం అసంపూర్తి పనులే ఎక్కువని ఎద్దేవా చేశారు ఇప్పటికైనా సాగునీళ్లను వృధాగా పొకుండా ఆపి అసంపూర్తి కాలువల పనులన్నీ,పూర్తీ చేసిన తరువాత నీళ్లు వదలాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమములో చెలికాని యాదగిరి ,తప్పెట శంకర్,జంగిటి శ్రీను ,దేవులపల్లి రాజు ,దేవులపల్లి కృష్ణశ్రీను, చింతల రాజు ,తదితరులు పాల్గొన్నారు.