Telangana
మల్కాజిగిరి డివిజన్ లోని ట్యాంక్ బండ్ విగ్రహాల తీసివేత పనుల పట్ల అశ్రద్ధ
Reporter Mahender Kalinga Times, Malkajigiri : పది రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న వినాయకుల విగ్రహాలను నిమజ్జనం చేసిన తర్వాత జరిగే పరిశుభ్రత తంతును అధికారులు ఏదో మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. దీనితో ఆయా పరిసరాలు దుర్గంధంతోపాటు క్రిమి,కీటకాలకు ఆలవాలంగా మారుతున్నాయి. హ్య్దరాబాద్నగరంలో మల్కాజిగిరి పరిధిలోని మిని ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం చేసిన గణ నాథుల పరిసరాలలో నెలకొన్న తీరే జి.హెచ్.ఎం.సి అధికారుల అలసత్వానికి నిదర్శనం. దాదపుగా నిమజ్జనం జరిగి వారం రోజులు కావొస్తున్నా మల్కాజిగిరి డివిజన్ లోని ట్యాంక్ బండ్ లో విగ్రహాల తీసివేత పనుల పట్ల అశ్రద్ధ వహించడం మూలంగా ఆయా పరిసరాలలో ధుర్గంధం తో పాటు దోమలు విపరీతంగా చుట్టుముడుతున్నాయని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సంబందిత అధికారితో మా కళింగ పత్రిక ప్రతినిది మాట్లాడగా పనులు చేసే కాంట్రాక్టర్ జ్వరం తో ఉన్నాడని తెలిపారు.ఆయన ఒక్కడి అనారోగ్యం మూలంగా అందరూ ఇబ్బందులు పడాల్సిందేనా ?