Telangana

చిచ్చర పిడుగు ఉజ్వల్ తేజ్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలి

Kalinga Times,Hyderabad : ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్రతో మోడలింగ్ లో రాణిస్తు అనేక బహుమతులు గెలుచుకున్న ఉజ్వల్ తేజ్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని,రాష్ట్రానికే కాకుండ దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చేటట్లు అవాకాషం కల్పించాలని ఉజ్వల్ తల్లి శ్రీమతి వసుందర కోరారు. ఈ రోజు మిడీయా సమావేశంలో ఉజ్వల్ సాధించిన అవార్డు గురించి దుబాయ్ లో పాల్గొనున్న విషయాలను వెల్లడించారు.సికింద్రాబాద్ లోని అల్వాల్ పరిధిలోగల వేస్ట్ వెంకటాపురం నివాసి మధ్యల అనిల్ కుమార్,వసుందరలకు ఏకైక కుమారుడు ఉజ్వల్ తేజ్ వయస్సు ఏడుసంత్సరాలు,అల్వాల్ లోని పల్లవి మోడల్ స్కూల్ లో రెండవ తరగతి చదువు తున్నాడు. గత సంవత్సరం నుండి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఫ్యాషన్ షోలతో పాటు,మోడలింగ్,నటనలో మక్కువ చూపెడుతుండడంతో పలు పేరుగాంచిన పాఠశాలలో జరిగిన పోటీలలో పాల్గొని అవార్డులు గెలుచుకున్నాడు.తన కంటూ గుర్తింపు తెచ్చుకుంటు,రాణిస్తు,క్రికెట్ ప్లేయర్ కావాలని ఆకాంక్షిస్తున్నాడు.చదువులో కూడ క్లాసులో మొదటి ర్యాంక్ సాదిస్తు ఆయా రంగాలలో రాణిస్తున్న ఈ చిచ్చర పిడుగును తెలిసినవారు ప్రతి ఒక్కరు అభినంచిచాల్సిందే. జూనియర్ మోడల్ ఇంటర్ నేషనల్ 2019 ఫ్యాఫన్ రన్ వే వారు నిర్వహించిన మోడల్ పోటీలలో సూపర్ మోడల్స్ ని మించిన ఫోజులివ్వడం జరిగింది. ర్యాంప్ మీద స్టైలిష్ గా వాక్ చేయడంతో ప్రధమ స్థానంలో నిలిచాడు.అదంత చాక్లెట్ తినంత ఈజీగా ఉన్నదని ఈ సందర్భంగా మీడీయాకు ఉజ్వల్ వివరించాడు.
దుబాయ్ లో అక్టోబర్ 14 జరుగనున్న జూనియర్ మోడల్ ఇంటర్ నేషనల్ పోటీలలో కూడా పాల్గొంటున్నాడు ఉజ్వల్ తేజ్.కలకత్తాలో జరిగిన మోడలింగ్ పోటీలలో పాల్గొనగా ప్రత్యేక గుర్తింప తెచ్చుకోవడంతో ఆహ్వానం కూడ అందుకున్నాడు. దీంతో దుబాయ్ లో జరుగనున్న ఈ పోటీలలో గెలిచి తీరాలని రాష్ట్రానికి,దేశానికి పేరు తేవాలని తపనతో ప్రాక్టీస్ చేయిస్తున్నామని తప్పక విజయం సాదిస్తాడని ధీమాతో ఉన్నామని వసుందర తెలిపారు.విద్యతో పాటు తనకు ఇష్టమైన రంగంలో ప్రతిభ కనబరిచేవిధంగా ప్రోత్సహిస్తున్నామని,అందుకు పల్లవి మోడల్ స్కూల్ యజమాన్యం తోడ్పడుతుందని,ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని,ఆదుకోవాలని వసుందర ఈ సందర్భంగాకోరుతున్నారు.ఈ చిచ్చర పిడుగు అతి చిన్నవయసులో ఆయా రంగాలలో రాణించడం గర్వించదగిన విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంధ్రశేఖర్ ఉజ్వల్ తేజ్ విషయంలో ఆదుకుని ప్రోత్సహించాలని పలువురు కోరుతున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close