Telangana
తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు
Kalinga Times, Hyderabad : 2019-20 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి ప్రవేశపెట్టారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని, మాంద్యం ప్రభావం రాష్ట్రంపై నామమాత్రమేనని అన్నారు. ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా పడటంతో, జాతీయ సగటుతో పోలిస్తే అధిక జీడీపీ సాధ్యమేనని అన్నారు.
- 2019-20 సంవత్సరానికి బడ్జెట్ అంచనా రూ. 1,46,492 కోట్లు.
- ఫిబ్రవరిలో సమర్పించిన అంచనా రూ. 1.82 లక్షల కోట్లతో పోలిస్తే తగ్గిన అంచనాలు.
- దేశంలోనే తెలంగాణ అగ్రగామి రాష్ట్రం.
- గత ఐదేళ్లలో ఎన్నో వినూత్న పథకాలు.
- 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు నెలకు ఖర్చు రూ. 6,247 కోట్లు.
- ఈ సంవత్సరం నెలకు రూ. 11,305 కోట్లు ఖర్చవుతోంది.
- గడచిన ఐదేళ్ల వ్యవధిలో ఆదాయ వృద్ధి సాలీనా 21.49 శాతం.
- 2018-19 ఆర్థిక సంవత్సరం వృద్ధి 5.8 శాతం.
- రాష్ట్ర జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 10.20 శాతానికి పెరిగింది.
- రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు.
- మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు.
- బడ్జెట్ అంచనాలో మిగులు రూ. 2,044.08 కోట్లు.
- ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు.
- 29 శాతం తగ్గిన పన్నేతర ఆదాయం.
- రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్లో కోత పెడుతున్న కేంద్రం.
- అన్ని రంగాలకూ నాణ్యమైన విద్యుత్ ను రోజంతా అందిస్తున్నాం.
- రైతు బంధు, రైతు బీమాలతో రైతాంగానికి ఎంతో మేలు.
- సుస్థిరమైన అభివృద్ధిని సాధ్యం చేసి చూపించాం.
- రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యం.
- వ్యవసాయ రంగంలో 8.1 శాతం వృద్ధిని సాధించాం.
- ఐటీ ఎగుమతుల విలువ 100 శాతానికి పైగా పెరిగింది.
- గురుకులాల పేరుతో అత్యున్నత ప్రమాణాలతో విద్య.
- రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో లక్ష మందికి పైగా చదువుతున్నారు.
- మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువుల్లో నీరు చేరింది.
- ప్రతి ఒక్కరికీ మంచి నీటి కొరత లేకుండా చేసి చూపుతాం.
- కనిపిస్తున్న గణాంకాలన్నీ మాంద్యం ఉందని చూపుతున్నాయి.
- వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గడం కూడా ఇందుకు నిదర్శనం.
- వాహనాల కొనుగోలు 10 శాతానికి పైగా తగ్గింది.
- కొనేవారు లేక దిక్కులేకుండా పడివున్న వేలాది వాహనాలు.
- వాహన అమ్మకాలు సాగితే, మరింత ఆదాయం లభించివుండేది.
- విమానయాన రంగంతో పాటు గూడ్స్ రైళ్ల బుకింగ్ పైనా మాంద్యం ప్రభావం.
- రూపాయి మారకపు విలువ దారుణంగా పడిపోవడం భయాన్ని కలిగిస్తోంది.
- ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గుడ్డిలో మెల్లలా రాష్ట్ర పరిస్థితి.
- విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చింది.
- గత బడ్జెట్ కు, ఇప్పటి బడ్జెట్ కు ఎంతో తేడా ఉంది.
- కేంద్ర, రాష్ట్రాల ఆదాయ వృద్ధి గణనీయంగా పడిపోయింది.
- ప్రజోపయోగ కార్యక్రమాలకు రూ. 1,03,551 కోట్లు.
- రాష్ట్ర పారిశ్రామిక రంగంలో 5.8 శాతం వృద్ధి లక్ష్యంగా ముందడుగు.
- ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు కొనసాగుతాయి.
- రైతు బంధు పథకాన్ని ఆపాలన్న ఆలోచనే లేదు.