social

మాయిశ్చరైజర్‌ లోషన్‌ అప్లయి చేసి లిప్‌స్టిక్‌ అప్లయి చేయండి

Kalinga Times, Hyderabad : గ్లిజరిన్‌ రెండుచుక్కలు, నిమ్మ రసం అరచెంచా ఈ రెండింటి మిశ్ర మాన్ని పెదవ్ఞలకు రాసి పావ్ఞగంట తరువాత కడిగి వేయాలి. దీనివల్ల పెదవ్ఞల నలుపు, పగుళ్లుపోతాయి.ఆహారంలో ‘బివిటమిన్‌, ‘సి విటమిన్‌ జింక్‌ గల పదార్థములు తీసుకుంటే పెదవ్ఞలు పగలవు.జాజికాయ పొడి, పసుపు, నెయ్యి సమభాగములుగా తీసుకుని పెదవ్ఞలకు రాస్తే పగుళ్లు పోతాయి. వెన్నపూస రాస్తే పెదవ్ఞల పగుళ్లు పోతాయి. మార్కెట్‌లో చాప్‌స్టిల్‌ అని అమ్ముతారు. అది అప్లయి చేసినా పగలవ్ఞ. పీనట్‌ బట్టర్‌ కాని కోకోబట్టర్‌ కాని అప్లయిచేస్తే పగుళ్లుపోతాయి. బీట్‌రూట్‌ రసం రాస్తే పెదవుల నలుపు క్రమేపీ పోయి గులాబీ రంగులోకి వస్తాయి. గులాబీ రేకులు నూరి తేనె కలిపి ఆ మిశ్రమాన్ని పెదవులకు రాస్తే నలుపు పోతుంది.


లిప్‌స్టిక్‌ వల్ల పెదవులు పాడవుతాయనేది కేవలం అపోహ. మంచి బ్రాండ్‌ లిప్‌స్టిక్‌ వల్ల పెదాలకు మంచేగాని చెడు జరగదు. లిప్‌స్టిక్‌ పెదవవులకు రక్షణ కవచం లాంటిది. లిప్‌స్టిక్‌ అప్లయి చేసే ముందు కోల్డ్‌క్రీమ్‌గాని మాయిశ్చరైజర్‌ లోషన్‌ గాని అప్లయి చేసి తరువాత లిప్‌స్టిక్‌ అప్లయి చేయండి.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close