Telangana
దత్తన్న సేవలు మరువలేనివి-శ్రీకాంత్
Gavvala Srinivasulu , Kalinga Times, Hyderabad : భారతీయ జనతా పార్టీలో అనేక కీలక పదవులు నిర్వహించిన బండారు దత్తాత్రేయ పార్లమెంటు సభ్యుడిగా జంటనగరాల అభివృద్ధి చేసిన కృషి అమోగమని రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షుడు,సికింద్రాబాద్ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చీర సత్యనారాయన ( శ్రీకాంత )అన్నారు. ఈ రోజు ఉదయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా నియమితులైన సందర్భంగా బండారు దత్తాత్రేయను ఆయన నివాసంలో శ్రీకాంత్ శాలువ కప్పి పూలబోకెతో శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాంత్ తోపాటు ఎడ్యూకేషన్ విభాగం చైర్నన్ కొంగొండ విమల్,సీనియర్ బీజేపి నాయకులు రాజేష్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దత్తాత్రేయ రాష్ట్రానికి,పార్టీకి చేసిన సేవలను శ్రీకాంత్ మీడీయాతో కొనియాడారు.బీజేపీ అధిష్టానం దత్తన్నకు గవర్నర్ పదవిలో నియమించడం దేశ కురుమలందరు అలాగే బీసీలు కూడ గర్వించదగిన విషయమని,గవర్నర్ పదవికి వన్నెతెచ్చి,పేరు ప్రతిష్ఠలు సంపాదించుకోవాలని,ప్రజలకు మరింత సేవలందించాలని కోరుతున్నామని ఆయన హర్షం వ్యక్తం చేశారు.