Telangana
కంటోన్మెంట్ గాయత్రి గార్డెన్స్ లో బెస్ట్ టీచర్స్ అవార్డు కార్యక్రమం
Gavvala Srinivasulu,Kalinga Times, Hyderabad : గురువును దేవుడితో సమానంగాచూస్తు వారని పూజిస్తూ గురుదేవోభవని అనేది మన భారతీయ సంప్రదాయం, కాబట్టే టీచర్స్ డే ని నిర్వహించు కుంటామని, అందుకు ప్రతి ఏటా గురుపూజోత్సహం జరుపుకోవడం జరుగుతుందని కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ఛైర్మన్ జంపన ప్రతాప్ అన్నారు. సెప్టెంబర్ 5న జరుగనున్న టీచర్స్ డే పురస్కరించుకుని బుధవారం కంటోన్మెంట్ లోని గాయత్రి గార్డెన్స్ లో జరిగిన బెస్ట్ టీచర్స్ అవార్డు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్, జింఖాన్ ఆధ్వర్యంలో ఈ అవార్డుల కార్యక్రమం వైభవంగా జరిగింది. కంటోన్మెంట్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని ఉఫాద్యాయులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ టీచర్లు విద్యార్థులను భావి పౌరులుగా తీర్చి దిద్దడంలో ప్రముఖ పాత్ర వహించినడం జరుగుతుందని,దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని ఆయన ఉద్భోదించారు. గురువును ప్రతి ఒక్కరు దేవుడితో సమానంగా పూజించినపుడే సమసమాజాభివృద్ది చెందుతుందని కూడ ప్రతాప్ తెలిపారు. టీచర్స్ ను సన్మానించడం కనీస భాద్యతగా భావించి ప్రతియేటా బెస్ట్ టీచర్స్ అవార్డులను అందజేస్తున్నామని లయన్స్ క్లబ్ ప్రోగ్రాం చైర్మన్ లయన్ ఎం. రాములు అన్నారు. గు-చీకటి, రు-పారద్రోలడం అని ఆయన అన్నారు. టీచర్లు సత్కరించడంతో వారిని ఎంతో ప్రోత్సహించినట్లవుతుందని తెలిపారు.తదనంతరం సికింద్రాబాద్ డిప్యూటీ డిఈవో కే. యాదయ్య తదితర అధికారులు ప్రసంగించారు. 50మందికి పైగా ఉపాద్యయులను పూలమాలలతో శాలువలు కప్పి మెమంటో పాటు ప్రశంశా పత్రాలను జంపన ప్రతాప్, లయన్స్ క్లబ్ చైర్మన్ పి. శిరీష్ కుమార్ తదితర ప్రముఖులు హర్షద్వానాల మధ్య అందజేశారు. పి. పి. టి. ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి గౌతమి నాయుడు, మారేడ్ పల్లి ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ ఎం. ఆర్. గీత తదితరులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుపుతూ ఆవార్డులు ఇస్తు న్నందుకు మాకు గర్వంగా ఉందని, మాపై మరింత భాధ్యత ఉంచినట్లైయిందని మీడియాతో అన్నారు.