Kalinga Times, Hyderabad : తెలంగాణ రాష్ట్రగవర్నర్ నరసింహన్ బదలీ అయ్యారు. ఆయన స్థానంలో రాష్ట్ర గవర్నర్ గా తమిళసై సౌందరరాజన్ ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా నరసింహన్ కు ఏ బాధ్యతలు అప్పగించనున్నారన్నది ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారుదత్తాత్రేయను హిమాచల్ గవర్నర్ గా నియమిస్తూ ఉత్తర్వలు జారీ అయ్యాయి. ఇలా ఉండగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ నరసింహాన్‌తో ఆదివారం నాడుసాయంత్రం భేటీ అయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ తో మంచి సంబంధాలు ఉన్నాయి.
నరసింహన్ విధులకు దూరమైన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి నరసింహన్ సేవలను వినియోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. సుదీర్ఘ కాలం పాటు రాష్ట్రానికి నరసింహన్ సేవ చేశాడు. దీంతో కేసీఆర్ ఆయన సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్టుగా సమాచారం.ఇప్పటికే రిటైర్డ్ ఐఎఎఎస్, ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ సలహదారులుగా కేసీఆర్ నియమించుకొన్నారు. నరసింహన్ ను కూడ నియమించుకొనే అవకాశం ఉందని అంటున్నారు.